Description
మనుషులంతా ఒక్కటేనా
ఎవరి రంగు రుచి వాసన వారివే గదా
ఎవరి ఊహల తీపి, కన్నీటి ఉప్పన వారివే గదా
పెద్దల ఆకాంక్షలన్నీ పిల్లలు తీర్చగలరా
ఎవరూ మరొకరి ఆశయాన్ని అనువదించలేరు.
– ధిక్కరించకపోతే దిక్కులు దద్దరిల్లేటట్టు పొలికేక పెట్టకపోతే అది కవిత్వమెట్లా అవుతుంది?
– ఎప్పుడూ ఏదీ పోగొట్టుకోనివాడి కోసం కనీసం ఎప్పుడైనా ఏదన్నా దొరికినవాడి కోసం వెతుకుతున్నా.
– పెద్దగా నేర్పిందేమీ లేదు పలకమీద ‘దయ’ అనే రెండక్షరాలు రాసి దిద్దించాను.
– జీవితం ఒక అద్భుత పుష్పం వికసించే ప్రక్రియ.
– ఈ సగం చెవిటి ప్రపంచంలో ఎవడు ఎక్కువమందిని తనివిదీరా పిలవగలడో పిలిపించుకోగలడో వాడికి నా వందనాలు.
– ప్రతి మనిషీ బతుకంతా కోర్కెల బరువులతో ఒక కొండనెక్కుతూనే ఉన్నాడు.
– స్త్రీలు భూదేవతలు సూర్యచంద్రులు రెండు స్తనాలైనవాళ్ళు.




