Description
ఈ కథానిక సంపుటిలో మొత్తం ఇరవై నాలుగు కథలున్నాయి. ఇవన్నీ చాలా బాగున్నాయి. వేగంగా చదివిస్తాయి. ప్రతిభా మనోజ్ఞంగా భాసిస్తున్నాయి. శోభిస్తున్నాయి. ఇంచుమించుగా తెలుగు కథ పుట్టు పూర్వోత్తరాలకు నూట ఇరవై అయిదు సంవత్సరాల చరిత్ర ఉంది. బహుశా ఒక లక్ష కథలదాకా వివిధ పత్రికలలో ఈ ‘సవాశతాబ్దం’ లో వచ్చి ఉంటాయి. అయితే ఏక కుటుంబం నుంచి ఇటువంటి మంచి కథలు ఓకే సంకలనంగా రాలేదు. ఎవరూ తేలేదు.



