Description
యువ రచయిత డా.కొరటమద్ది హేమంత్ నవల ‘‘నీ చూపు చెప్పింది నాకు’’ నాయికానయకుల మధ్య సినిమాటిక్ స్క్రీన్ ప్లే పద్ధతిలో నడిచిన సున్నితమైన ప్రేమకథ – కె.వి. విజయేంద్ర ప్రసాద్. (సినికథా రచయిత, దర్శకులు) ఈ జీవితం శాశ్వతం అనుకుంటూ తన కుటుంబం, తన వంశం అనుకుంటూ ఫ్యూచర్లో బ్రతికే మానవులని ప్రెసెంట్లో బ్రతకమని…ఈ క్షణాన్ని ఆనందించమని… ప్రేమ కథ ఆధారం చేసుకున్న తన నవల ద్వారా చెప్పిన హేమంత్కి నా అభినందనలు – చిన్న కృష్ణ (సినీకథా రచయిత) పాత్రలు బాగా పరిచయం అయ్యాక… ట్రాజెడీయా, సుఖాంతమా అని ఉత్కంఠగా ముగింపు చూసి ‘‘అమ్మయ్య’’ అనుకున్నాను. మళ్ళీ చదవడం ప్రారంభించాక మళ్ళీ మళ్ళీ వెనక్కి తిరిగి చదవాల్సిన వాక్యాలు, సంఘటనలు…




